సిసి కెమెరాల ఆధారంగా ఒక్క రోజులోనే దొంగనూ పట్టుకున్న.పోలీసులు సిఐ శ్రీనివాస్ ను నాగిరెడ్డి పెట్ ఎస్ ఐ పోలీసులను అభినందించిన అడిష్నల్ యస్ పి. యస్ పి .
డి యస్ పి శ్రీనివాసులు.వెల్లడి
ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (జనం సాక్షి)కొత్త ఇంటి నిర్మాణం చేస్తుండగా ఇంటి వద్ద సామానుల కోసం పాత ఇంటికి తాళం వేసి వెళితే పాత ఇంట్లో దొగంతనం జరిగినట్లు దొగంతనం జరిగిన ఒక్క రోజులొనే దొంగని పట్టుకున్నట్లు గురువారం స్థానిక ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. డిఎస్పీ వివరాలు తెలిపిన ప్రకారం నాగిరెడ్డి పెట్ మండలం బొల్లారం గ్రామానికి చెందినా మంగలి సుజాత భర్త లేట్ గోపాల్ ఫిర్యాదు మేరకు సుజత కొత్త ఇంటి నిర్మాణం చేపడుతుండగా కొత్త ఇంటి దగ్గర సామాను కావలి నిమిత్తం పాత ఇంటికి తాళం వేసి కొత్త ఇంటి దగ్గర రాత్రీ సమయంలో నిద్రిస్తుండగా ఎప్పటి లాగే 11.10.2022 నాడు సాయంత్రం 8 గంటలకు తాళం వేసి కొత్త ఇంటి వద్దకు వెళ్ళింది.మరల ఉదయం12.10.2022 నాడు 6 గంటలకు పాత ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో సామాను చిందర వందరగా పడి ఉండటం వలన ఇంటి వెనకాల కూలిన ఇల్లు గది ద్వారా ఇంట్లోకి ప్రవేశించి ఇంటి లోపల గది తాళం తీసుకొని బిరువాను తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు 23 గ్రాములు, వెండి 74 తులాలు, కాళ్ళ పట్టీలు 20 తులాలు , కడియాలు 10 తులాలు మరియు 30 వేల నగదు దొంగలించుకపోయారని బుధవారం నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామంలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా ఎటువంటి బయట వ్యక్తులు లేకపోవటం తో స్థానికంగా ఉన్న పాత నేరస్తుల ను విచారించగా అదే గ్రామానికి చెందినా పాత నెరస్తుడు మంగలి గౌరి శంకర్ చెప్పుల ముద్రలు నేర స్థలం లో ఉన్న చెప్పుల ముద్రలు పోలి వుండటం తో అతనిని పోలీసులు విచారణ చేపట్టగా నేరము చేసినట్టు అంగీకరించాడు. అతని వద్దనుండి దొంగిలించిన వస్తువులు తిరిగి స్వాధీనం చేసుకొని నిందితుడిని రీమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఒకే రోజులో ఛేదించిన ఎల్లారెడ్డి సి ఐ శ్రీనివాస్, ఎస్ ఐ నాగిరెడ్డిపేట్ మరియ సిబ్బంది ని ఆడిషనల్ ఎస్పీ, ఎస్పీ తెలిపారు.