సి.ఎం.ఆర్. రైస్ ను నిర్ణీత కాలంలోగా అందివ్వాలి…

సి.ఎం.ఆర్. రైస్ ను నిర్ణీత కాలంలోగా అందివ్వాలి…

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ జూలై 27(జనం సాక్షి): వానాకాలం 2021-22 కు సంబంధించి సి.ఎం.ఆర్. రైస్ ను నిర్ణీత కాలంలోగా అందివ్వాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సి.ఎం.ఆర్. రైస్ పై జిల్లా లోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు తో అధికారులతో అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 44వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన బియ్యంగా మార్చిఅందజేయాలన్నారు.మిల్లర్లు రోజు వారీగా ఎంత ధాన్యాన్ని బియ్యంగా ఇస్తున్నారన్నది అధికారులు నివేదిక ఇవ్వాలన్నారు. ఆలాగే మిల్స్ వద్దసిబ్బందికి విధులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.మిల్లర్లు 24 గంటలపాటు ధాన్యం ను బియ్యంగా మార్చేందుకు మిల్స్ ను నడిపించాలని, రోజువారీగా లక్ష్యాలను రూపొందించుకొని సి.ఎం.ఆర్. రైస్ ను ఇవ్వాలన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగానే బియ్యాన్నిఅందజేయవలసి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని రోజారాణి ,సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సంధ్యారాణి, తహసీల్దార్ లు, సివిల్ సప్లై డీటీలు, ఏ.యం. టెక్నికల్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్ ఉపాధ్యక్షులు బి సతీష్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.