సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత

జనం సాక్షి కదలాపూర్
కథలపూర్ మండలంలోని గంభీర్ పూర్ గ్రామనికి చెందిన మల్యాల జలంధర్ 55,వేలు,బోలుమల్ల గంగు 60 వేలు,కమల్ల సురేష్ 15,వేల ఐదు వందలు,సనిగరపు పెద్ద గంగారాం33,వేలను లబ్ధిదారులకు
మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల జడ్పీ టీ సి నాగం భూమయ్య , ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్ లు కలిసి అందజేశారు. ఈసందర్భంగా చెక్కు మంజూరు కృషి చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమానేని రమేశ్ బాబు,మాజీ మార్కుఫెడ్ చేర్మెన్ లోక బాపూరెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలోస్థానిక సర్పంచ్ పోతు సిందుజ శేఖర్,ఉప సర్పంచ్ జవ్వాజి శ్రీను,మండల పార్టీ అధ్యక్షులు గంగా ప్రసాద్,నాయకులు జెల్ల వేణు, శీలం మోహన్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు బాబా శంకర్, నస్కురి భాస్కర్,ముంజ శ్రీను,సత్తార్ పలువురు ఉన్నారు.