తెరాస రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటీ )
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ లోని కొంగరకలాన్ లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా మంత్రి,జిల్లా ఎమ్మెల్యేలతో, జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటు జిల్లా పార్టీ రథసారధి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తో కలిసి నేడు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభిస్తారని అనంతరం కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో బహిరంగ సభను విజయవంతం చేయాలని తెరాస రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తున్నదని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే సభా ప్రాగణం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పిలుపుమేరకు 15 వేల మందిని సభ కీ తరలిస్తున్నట్లు తెలిపారు.ఆత్మీయ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,సీనియర్ నాయకులకు,పార్టీ వివిధ గ్రామాల, మున్సిపాలిటీ కార్యకర్తలకు,తెరాస పార్టీ ప్రజాప్రతినిధులకు,అనుబంధ సంఘాల శ్రేణులకు, నియోజకవర్గాల ప్రజలకు, రైతులకు, మహిళలు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు