సీఎం పాల్గొనే సభాస్థలిని పరిశీలించిన సీపీ
వరంగల్ రూరల్,నవంబర్19(జనంసాక్షి): నర్సంపేట మండలంలో నవంబరు 23న నిర్వహించనున్న తెరాస ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనే సభాస్థలిని జిల్లా పోలీస్ కమిషనర్ డా.రవీంద్రనాథ్ పరిశీలించారు. వరంగల్ తూర్పు మండల డీసీపీ అనురాధ, నర్సంపేట ఏసీపీ సునితా మోహన్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పట్టణ శివారులోని సర్వాపురం వ్యవసాయ, మైదాన భూములను పరిశీలించారు. వేదిక ఏర్పాటు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అంతకుముందు మార్కెట్ బైపాస్ మార్గంలోని హెలీపాడ్‌ను పరిశీలించారు.