సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
బచ్చన్నపేట అక్టోబర్ 20 (జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బచ్చన్నపేట టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొడిగం చంద్ర రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గిరబోయిన అంజయ్య ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అని అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి రుణపడి ఉంటాం– లబ్ధిదారులు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తమ కుటుంబాలకు సహాయంగా అందించినందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి, బచ్చన్నపేట మండల టిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ షబ్బీర్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, ఎంపిటిసి గుడపు లత శ్రీ తిరుపతి గౌడ్, సర్పంచ్ లక్ష్మి బావులు, ఉప సర్పంచ్ వల్లూరి విజయలక్ష్మి కిష్టయ్య, టిఆర్ఎస్ నాయకులు సుధాకర్,యాదగిరి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.