సీజనల్ వ్యాధులపై అవగాహన
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి
నిజామాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సుచరిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా, టైఫాయిడ్, వైరల్‌ఫీవర్ గురించి, వ్యాధుల వ్యాప్తి వాటి నివారణకు తీసుకునే చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్లు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. అలాగే ఎడపల్లి ప్రామిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఎంపీపీ శ్రీనివాస్, బోధన్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సందర్శించి వైద్య సిబ్బందితో సవిూక్షా సమావేశం నిర్వహించారు. వర్షా కాలం దష్ట్యా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వంటి తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మండల వైద్యాధికారిని జవేరియా, డాక్టర్ వెంకటేష్ సిబ్బంది రాములు, రవి, తదితరులు పాల్గొన్నారు.