సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
అప్రమత్తం అయిన ఆరోగ్యశాఖ అధికారులు
ఆదిలాబాద్,జూన్28(జనం సాక్షి): జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలను చైతన్యపరుస్తూ అన్ని గ్రామాల్లో దోమల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు జిల్లాలో వాటర్ ట్యాంకులు, బోరుబావులు ఇతర ప్రాంతాల్లో ప్రజలు నీరు తాగే చోటా కలుషితం కాకుండా క్లోరినేషన్ కూడా చేపడుతున్నారు. గత ఏడాది జిల్లాలో పలు గ్రామాల్లో విషజ్వరాలు విజృబించడంతో అనేక మంది ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ముందస్తు చర్యలు చేపట్టారు. మిగతా ప్రాంతాల్లో వ్యాధుల ప్రభావం పెద్దగా లేకపోయినా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటోంది.జిల్లాలో దోమలు వృద్ధి చెందకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గతంలో సీజనల్ వ్యాధులు ప్రబలిన పది మండలాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు విజృబింస్తున్నాయి. దీంతో ముందస్తుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను చేపట్టారు. ఇంపదకు గాను జిల్లాకు క్లోరినేషన్ చేయించారు. ప్రధానంగా మంచినీటి ట్యాంకులు, బావులు, అర్‌డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో క్లోరినేషన్ చేయడం ద్వారా నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నివారించనున్నారు. మలేరియా, డెంగ్యూలతోపాటు విషజర్వాలు ప్రబలే ప్రాంతాలను ముందస్తూగా గుర్తించిన అధికారులు ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. గూడాలు, తండాల్లో ఏచిన్న అనుమానం వచ్చినా వెంటనే అక్కడకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించి, రక్తనమూనాలు సేకరించే విధంగా కార్యాచరణను అధికారులు చేపట్టారు.
————————-