సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

సామాజిక ఆరోగ్య కేంద్రం
మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్
జులై 18 (జనంసాక్షి) 
మహాదేవపూర్ మండల కేంద్రంలో ని ప్రజలను .అప్రమత్తం చేస్తూ డాక్టర్  చంద్రశేఖర్ మాట్లాడుతూ.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందని  వాటికి సంబంధించిన పలు, సూచనలు,  ఆరోగ్య కేంద్రం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజ్ కుమార్  ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. తీవ్రమైన వర్షాలు, వరదల వల్ల ఇంటి పరిసరాలలో గల గుంతలు ఇతర వస్తువులలో నీరు నిల్వ ఉండే అవకాశం దృష్ట్యా.దోమలు ,కలుషితమైన నీరు ఏర్పడి వాటర్ పాయిజన్, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని, వాటి బారిన పడకుండా  జాగ్రత్తలను తీసుకోవాలని  డాక్టర్లు చంద్రశేఖర్, రాజ్ కుమార్ వివరించారు. వరదల వల్ల వచ్చిన నీటిలో నడవడం ద్వారా కాళ్లకు పై భాగంలో, ఆ నీటిని తాకడం వల్ల చేతులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు అన్నారు. కావున  నీళ్ళు నిల్వ ఉన్న పాత్రలను, డ్రమ్ములలో,పగిలి పోయిన కుండాలలో,పాత వాటర్ కూలర్లలో, టైర్లలో ఉన్న నీటిని పారబోయాలని సూచించారు.డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.  అందుకోసం నీటిని వేడి చేసుకుని, కాచి చల్లార్చి, వడబోసిన నీటిని మాత్రమే తాగాలని వారు సూచించారు.ఏదేని ఆపద, బాధ, అనారోగ్య పరిస్థితులు కలిగినట్లయితే మహాదేవపూర్ ఆసుపత్రిలో డాక్టర్లను సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో . మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్ తో పాటు చిన్న పిల్లల వైద్య నిపుణులు  డాక్టర్ రాజ్ కుమార్ ,
సర్జన్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి,
 జనరల్ డాక్టర్లు రమేష్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.