సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

— అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
మహబుబ్ నగర్ ,జులై   ,(జనంసాక్షి ) :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య,పంచాయతీ,సంక్షేమ శాఖల అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. అలాగే అన్ని విద్యాసంస్థలను తనిఖి చేయాలని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు .
       సీజనల్ వ్యాధులు, పారిశుధ్యం పై బుధవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ,పంచాయతీ , సంక్షేమ శాఖల జిల్లా అధికారులు,గురుకులాల రీజనల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు పిహెచ్ సి లలో సకాలంలో అందుబాటులో ఉండాలని, అంతేకాక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలు, విద్యాసంస్థలను సందర్శించాలని చెప్పారు. హాస్టల్ వార్డెన్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ,గురుకుల ప్రిన్సిపల్స్ అందరూ వారి వారి పరిధిలోని విద్యాసంస్థలను తనిఖీచేయాలని తెలిపారు. ఎక్కడైనా మిషన్ భగీరథ నీటికి సమస్య ఉన్నట్లయితే తక్షణమే నీటి శాంపిలను పరీక్షకు పంపించాలని అన్నారు. నీరు నిల్వ ఉన్నచోట దోమలు పెరగకుండా గంభూషియా చేపలు వదలడం , ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని, ప్రత్యేకించి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు .జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, అడిషనల్ డిఎంహెచ్వో సరస్వతి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈవో జ్యోతి ,సంక్షేమ శాఖల జిల్లా అధికారులు యాదయ్య ,శంకరాచారి, ఇందిర ,చత్రు నాయక్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .
Attachments area