సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం స్థానిక 9వ వార్డులో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.నీటి తొట్లు, పాత టైర్లలో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఆ నీటిని తొలగించాలని సూచించారు.దోమలతో డెంగ్యూ , మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో 48 వార్డులకు దోమల మందు పిచికారి మిషన్లను అందజేసినట్లు తెలిపారు.నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు ప్రతి రోజు సాయంత్రం ఫాగింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area