సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయండి…
గద్వాల రూరల్ జులై 07 (జనంసాక్షి):- గత కొంతకాలం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గురుకుల పాఠశాల విద్యార్థులకు,గత మూడు నాలుగు రోజుల నుంచి గద్వాల పట్టణంలోని పలు విధులలో అస్వస్థతకు గురైన విషయం జిల్లా ప్రజలందరిన భయభ్రాంతులకు గురి చేస్తుంది… దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్ , ఆరోగ్య శాఖ అధికారి చందునాయక్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు…డిఎంహెచ్ఓ కార్యాలయ వైద్య సిబ్బంది, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, బురద పేట , మరియూ రాంనగర్ పరిధిలోని వార్డులలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరియు జింక్ టాబ్లెట్లు, మరియు వాంతులు మరియు నీళ్ల విరోచనాలు కు సంబంధించిన టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా, పదిమంది డాక్టర్లను, 20 మంది సూపర్వైజర్లను, 75 మంది ఆశలను, పదిమంది ఆరోగ్య కార్యకర్తలను ఇంటింటి సర్వే కొరకు మరియు మెడికల్ క్యాంపు కొరకు ఏర్పాటు చేయడం జరిగింది , అంతేకాకుండా, ఒక అంబులెన్స్ ను కూడా మెడికల్ క్యాంపులో రిఫరల్ కేసులను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది, నమోదవుతున్న కేసులు అన్నీ కూడా నీళ్లు కలుషితం కావడం వల్ల కాదని, కేవలము వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ముందు చేదు శుభ్రంగా కడగకపోవడం, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడకపోవడం, పరిసరాల పరిశుభ్రత లేకపోవడం, వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకపోవడం, బహిరంగ మలవిసర్జనకు వెళ్లడం, నీటిని కాచి వడపోసి తాగకపోవడం, వల్ల కేసులు నమోదుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి చందు నాయక్ గారు తెలియజేశారు