సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జడ్పిటిసి గట్ల మీనయ్య
రుద్రంగి జూలై 19 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో డ్రై డే లో భాగంగా మంగళవారం జడ్పిటిసి గట్ల మీనయ్య పాల్గొని మాట్లాడుతూ… సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.వారు ఇంటి ఇంటికి తిరిగి తొట్టిలలో కుండీలలో నీటి నిలువలు ఉంచుకోకూడదని ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్,డాక్టర్ పావని,ఎంపీఓ సుధాకర్, సెక్రటరీీ నాగరాజు,ఏపీఎం రాజేశ్వరి,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.