సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జడ్పీటీసీ మేకల గౌరమ్మచంద్రయ్య.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 28(జనంసాక్షి):
భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందు న మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖలఅధికారులు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ సూచించారు. గురువారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ మండల ప్రజలకు కొన్ని సూచనలు,సలహాలు సూచించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వర్షాల వలన దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందు తాయని, దోమల వలన డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా, మొదుడు వాపు, రోగాలు వచ్చే ప్రమాదము ఉంది కాబట్టి అందరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.దోమలు ఎక్కువగా ఇంటి పరిసరాల ముందు పాత టైర్లు, మంచి నీళ్ళు వచ్చే సంపులో, పాత కుండలో, త్రాగే కొబ్బరి బొండా లలో, ఇంటి లోపల ఉన్న కూలర్స్ లో, పూల కుండీల లో దోమలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.కావునా ఎప్పటికీ కప్పుడు వాటిలో ఉన్న నీళ్ళను తీసివేయాలని సూచించారు.అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.ప్రతి నివాస ప్రాంతంలోనూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని సూచించారు.గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు,విద్యుత్ స్తంభాలు,ట్రాన్స్ ఫార్మర్లు తదితర వాటిని తక్షణమే పునరుద్ధ రించుకోవాలని అన్నారు.అలాగే గ్రామాల్లో మంచి నీళ్ళు పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలని కోరారు.ముఖ్యంగా డెంగ్యూ,మలేరియా,విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామ పంచాయతీల వారీగా ప్రతి నివాస ప్రాంతంలో తక్షణ చర్యలు చేపట్టాలని ఈసందర్భంగా అధికారులకు సూచించారు. ఈ విషయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు