సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ సి రమేష్ రెడ్డి

రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన పోస్టర్లు విడుదల.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై23(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహ కారంతో జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించడంతో పాటు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సెక్రెటరీ సి రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సిజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని, మీకు సీజనల్ వ్యాధులపై అవగాహన ఉంటే మీ కుటుంబాలు, బందువులతో పాటు మీ గ్రామాలలో మీరు అవహగహన కల్పించగలరనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు గా అది మీ బాధ్యత అని గుర్తు చేశారు.ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.