: సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- డాక్టర్ మధు
గంగారం మండలం జులై (జనం సాక్షి)
గత 20 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గ్రామాలలో వీధులపై బురద నీరు పేరుకుపోయి వాటిపై దోమలు ఈగలు వాలి ఇండ్లలోకి రావడం జరుగుతుందని దీని కారణంగా విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నందున గ్రామాలలో హెల్త్ క్యాంపులను నిర్వహించి ప్రజలకు తగు ఆరోగ్య సూచన ఇవ్వాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు గంగారం మండలం పెద్ద ఎల్లాపురంలో హెల్త్ క్యాంపు ను నిర్వహించి జ్వరం లక్షణాలు ఉన్న వ్యక్తులకు రక్త పరీక్షలను చేసి లక్షణాలున్న వారికి మందులను ఇవ్వడం జరిగిందని డాక్టర్ మధు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వీరలక్ష్మి ఆశలు మంజూరు లక్ష్మి శారద పాల్గొన్నారు
Attachments area