సీబీఎస్ఇ ఫలితాల్లో వివేకానంద ప్రభంజనం
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
సీబీఎస్ఇ పరీక్షా ఫలితాల్లో స్థానిక జగిత్యాల రోడ్డులో గల వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. పదవ తరగతి ఫలితాల్లో పాలోజు ఇషా శర్వాణి 99.4 శాతం మార్కులతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫాతిమా, వైష్ణవి, దామోదర్, సాయి సంకల్ప్, పవన రెడ్డి, వైదిక లు నిలిచారు. 12వ తరగతి పరీక్ష ఫలితాలలో 463 మార్కులతో నశ్రా ప్రథమ స్థానంలో నిలవగా 441 మార్కులతో సఫురా సభా తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల చైర్మన్ డాక్టర్ పొల్సాని సుధాకర్ రావు తెలిపారు. విద్యార్థులను అభినందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా పరిపూర్ణత అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులను అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ వల్ల ఎదురైన సవాళ్లను అధికమించి అత్యద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ లలిత కుమారి , ప్రిన్సిపాల్ నడిమెట్ల ధర్మేందర్ లు పాల్గొన్నారు.