సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదు : హరీష్
హైదరాబాద్, జూలై 29 (జనంసాక్షి):
తెలంగాణ పై స్పష్ట మైన వైఖరి చేప్పని సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రాసాధన కోసం ఉధ్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆదివారం టీఆర్‌ఎస్ లో చేరిన పలువురు కార్యకర్తలను ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా షామీర్ పేట మండల కేంద్రంలో హరీష్ ప్రసంగించారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు పర్యాపదంగా మారిందని, ఈ ప్రాంతంలో మరో రాజకీయ పార్టీకి చోటు లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రాంతంలోని అన్ని జిల్లాలకు పాకిందని, దక్షిణ తెలంగాణలో సైతం టీఆర్‌ఎస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుందని ఆమన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో 20 ఉప ఎన్నికలు జరిగాయని, అన్నింటా విజమం టీఆర్‌ఎస్ దేనని హరీష్ రావు గుర్తు చేస్తు 10 శాసన సభా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, 15 నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారన్నారు. ఈ రెండు పార్టీలో రెండు, ముడు స్థానాలకు పరిమితమయ్యాయని వ్యాఖ్యానించారు. దేశం, వైఎస్‌ఆర్‌సి పార్టీ వల్లే తెలంగాణ ప్రస్తుతం అనిశ్చితి చోటు చేసుకున్నదన్న హరీష్‌రావు, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల వ్యతిరేకంగా జగన్, చంద్రబాబు ఎందుకు గళమెత్తలేదని ప్రశ్నించారు.