సీసీ కెమెరాలతో నేరాలను పసిగట్టవచ్చు
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్:
సీసీ కెమెరాలతో నేరాలను త్వరలో పసిగట్టవచ్చని ప్రజలు ఐక్యమత్యంగా ఉండి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తిమ్మాపూర్ గ్రామం ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం రేగోడు మండల పరిధి తిమ్మాపూర్ గ్రామంలో డి.ఎస్.పి సైదుల్, అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్, రేగోడు సబ్ ఇన్స్పెక్టర్, సత్యనారాయణలతో కలిసి, గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేగోడ్ మండలంలోని మారుమూల గ్రామమైన తిమ్మాపూర్ లో గ్రామస్తులు చందాల రూపంలో డబ్బులను పోగుచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని వారు గ్రామస్తులను కొనియాడారు. ఇలాంటి పట్టుదలే ప్రతి ఒక్క పనిలో ఉండాలని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు గ్రామంలో నుండి బయలుదేరే ముందు ఎలిమెంట్ ధరించి ప్రయాణించాలని వారు సూచించారు. మీ పట్టుదలే దేశానికి ఆదర్శం కావాలని మునుముందు తిమ్మాపూర్ గ్రామం గురించి అందరూ చర్చించుకునే విధంగా ఆదర్శమైన కార్యక్రమాలను నిర్వహించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని వారు సూచించారు. భావితరాల భవిష్యత్తులొ ఆదర్శంగా నిలువనున్న విద్యార్థులు విద్యలో ముందుకెళ్లాలని సూచించడంతోపాటు ప్రతి ఒక్కరు పోలీస్ నిబంధనలను పాటించాలన్నారు. మీ ఆదర్శవంతమైన ఎలిమెంట్ ధరించె తీర్మానానికి త్వరలో అందరూ కలిసికట్టుగా చర్చించుకొని ముందడుగు వేయాలని వారు కోరారు.
జిల్లా ఎస్పీ రావడం మా అదృష్టం
చరిత్రలో లేని రోజు ఈరోజు మా.. తిమ్మాపూర్ గ్రామానికి దక్కిందని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మా గ్రామానికి రావడం సంతోషకరమని మాజీ సర్పంచ్ సాయిలు అన్నారు. అధికారుల సూచనలు తప్పకుండా పాటిస్తామని పేర్కొన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో మునుముందు జరగనున్న మంచి కార్యక్రమాలకు సలహాలు సూచనలు ఇచ్చి సహకరించాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శినిని స్థానిక సర్పంచ్ నిర్మల సన్మానించారు కాగా ఎస్సై సత్యనారాయణ సాయిలకు సన్మానించగా ముఖ్య అతిథులను అలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జమీందార్ రాచప్ప , తిమ్మాపూర్ గ్రామ పోలీస్ చిట్టిబాబు,సిబ్బంది వీరన్న, వినోద్, జైపాల్,శ్రీను తదితరులు పాల్గొన్నారు..