సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు త్వరితగతిన పూర్తిచేయండి : కలెక్టర్ శ్రీ హర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 23 : మున్సిపాలిటీల పరిధిలో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.
శనివారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం నందు మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గద్వాల, వడ్డేపల్లి, ఐజ, అలంపూర్ మున్సిపాలిటీల పరిది లోజరిగే సిసి రోడ్లు, డ్రైనేజీల పనుల వివరాలు ఇవ్వాలని, పనులు జరగని చోట మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా లో ఏర్పాటు చేసే మూడు జంక్షన్ లలో రోడ్లు డివైడర్ లకు పెయింటింగ్ వేయించి డివైడర్ మధ్యలో మట్టి వేసి పెద్ద మొక్కలు నాటాలన్నారు. జిల్లా ఎంట్రెన్సు లో నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలనీ , గద్వాల పట్టణంలోని బస్టాండు, మార్కెట్ యార్డ్ నూతన కల్లెక్టరేట్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. గద్వాల్, ఐ జ, వడ్డేపల్లి, ఆలంపూర్ మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పనులు ముమ్మరం చేయాలని, వర్ష కాలం అయినందున దోమల వల్ల జ్వరాలు రాకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలని అట్టి నివేదికలు పంపాలన్నారు . డ్రైనేజీలలో మురుగు తొలగించి ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. ప్రతి మున్సిపాలిటీలోని వార్డులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా అదనంగా సిబ్బందిని నియమించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు శానిటేషన్ టీంలు పర్యటిస్తారని తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఇంటికి మొక్కలు అందజేయాలన్నారు. పార్కులలో మొక్కలు వేరివిగా నాటాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా లో ఉండే పార్క్ ల పనులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి వార్డును క్రమం తప్పకుండా కమిషనర్లు పర్యటించాలన్నారు.. ఇంటి పన్నులు, ఆస్తి పన్ను వసూలు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. బిల్ కలెక్టర్లు వారి పరిధిలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం బిల్లులు వసూలు చేయాలన్నారు.
ఈ సమావేశంలో కమిషనర్లు జానకి రామ్ సాగర్, విజయబాష్కర్ రెడ్డి , గోపాల్, దయానంద్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.