సీ-బ్లాక్‌లో నో ఎంట్రీ

3

సచివాలయంలో మీడియాపై మొదలైన ఆంక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే సీబ్లాక్‌ లోపలికి మీడియా ప్రతినిధులకు అనుమతి లేకుండా చేశారు. విూడియా గొంతు నొక్కే దిశగా టీ-సర్కార్‌ అడుగులు వేస్తోందన్న విమర్శలను పట్టించుకోకుండా సోమవారం భద్రతా సిబ్బంది విూడియాను అనుమతించలేదు.  విూడియాను నియంత్రించేందుకే కేసీఆర్‌ మొగ్గు చూపారని తెలుసప్తోంది.  విూడియా ప్రతినిధులు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీపీఆర్‌వో రూమ్‌లో కూర్చున్న విలేకర్లను పోలీసులు బయటికి పంపించారు. తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షలు పెడతామని కొద్దిరోజులుగా సీఎం అనుకూల పత్రికలో కథనాలు రాగా దానికి అనుగుణంగానే సోమవారం సెక్రటేరియట్‌లో విూడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. సి-బ్లాక్‌లోకి విూడియాకు అనుమతి ఇవ్వొద్దంటూ సెక్యూరిటీని సమాచార కమిషనర్‌ ఆదేశించారు. సీఎం పీఆర్‌వో గదిలో కూర్చున్న విూడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించి నేడోరేపో తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సి-బ్లాక్‌లో విూడియా ప్రతినిధులను పంపించివేయడంపై అన్ని బ్లాకుల్లో ఉన్న విూడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతుండంతో వెంటనే సీఎం పీఆర్‌వో అక్కడకు చేరుకుని విూడియా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు.