సుధాకర్ కు ఘన సన్మానం………………………………………..

క్రీడా రంగం మాత్రమే కాదు, ప్రజా రంగంలోనూ నిజాయితీ, చిత్తశుద్ధి తో, ఎంతో పట్టుదలగా సేవలు అందచేస్తున్న మానవత్వం ఉట్టి పడే క్రీడా కారుడు, కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ కు ఘనమైన సన్మానం లభించింది. కలెక్టర్ సహా పలు అధికారుల ప్రశంసలను సుధాకర్ ఈ సందర్బంగా అందుకున్నారు.ఆగస్టు 29న మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో జిల్లా క్రీడపాధికార సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జాతీయ క్రీడ దినోత్సవం వేడుకలలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కుమార్ హాజరై వేడుకలు ప్రారంభించారు, అనంతరం క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూ మంచి క్రీడాకారుల తీర్చిదిద్దుతున్న సెక్రెటరీలను శాలువలు, మెమెంటోలు, సర్టిఫికెట్స్ తో ఘనంగా సన్మానించారు, బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా సెక్రెటరీగా పుల్లూరి సుధాకర్ 2018 నుంచి సేవలు అందిస్తున్నారు 2018లో అండర్ 19 రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు, 2019లో అండర్ 15 రాష్ట్రస్థాయి పోటీలు, 2022లో అండర్ 17 రాష్ట్రస్థాయి పోటీలు మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు, జిల్లా క్రీడాకారులు ఎంతోమంది రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించుటకు కృషి చేస్తున్నారు, 2018లో హైదరాబాదులో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర బ్యాడ్మింటన్ జట్టుకు టీం మేనేజర్ గా వ్యవహరించారు, 2019లో ఒరిస్సా లో జరిగిన జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న రాష్ట్ర జట్టుకు టీం మేనేజర్ గా వ్యవహరించారు, 2022లో ఒరిస్సా లో జరిగిన జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న రాష్ట్ర జట్టుకు టీం మేనేజర్ గా వ్యవహరించారు, పుల్లూరు సుధాకర్ మేనేజర్ గా వ్యవహరించిన సమయంలో రాష్ట్ర జట్టు క్రీడాకారులు ఎన్నో మెడల్స్ సాధించారు,
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న బ్యాడ్మింటన్ సెక్రటరీ పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు ఏసిపి ఎడ్ల మహేష్, చీఫ్ అడ్వైజర్ గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు రమేష్ రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు పల్లెం రాజలింగు, కృష్ణ, హర్ష, నరేందర్, లక్ష్మీనారాయణ, అవీన్ బాబు, స్పాన్సర్స్ మరియు ముఖ్యంగా నా శ్రేయోభిలాషి నన్ను అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న నా గురువు మునీర్ సార్ ఆశీస్సులతో బ్యాడ్మింటన్ క్రీడను, క్రీడాకారులను ముందుకు తీసుకెళ్తున్నానని నాకు అవార్డు రావడంలో వీరందరి సహాయ సహకారాలు ఉన్నాయని తెలియజేస్తూ రానున్న రోజులలో మరింత ఉత్సాహంగా బ్యాడ్మింటన్ క్రీడను క్రీడాకారులను ప్రోత్సహిస్తానని తెలిపారు……………….. (ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )