సునీల్ నరైన్ స్పిన్ మ్యాజిక్ బంగ్లా 227 ఆలౌట్
విూర్పూర్, డిసెంబర్ 5: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్పిన్నర్లు సత్తా చాటారు. స్పిన్ మ్యాజిక్‌తో బంగ్లాను దెబ్బతీశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తవిూమ్ ఇక్బాల్, అనాముల్‌హక్ శుభారంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. వీరి పార్టన ర్‌షిప్‌ను విండీస్ స్పిన్నర్ నరైన్ బ్రేక్ చేశాడు. ఇద్దరినీ వెంటవెంటనే పెవిలియన్‌కు పంపాడు. ఇక్కడ నుండీ బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. నరైన్‌కు తోడుగా పెరుమాల్ కూడా రాణించడంతో బంగ్లా 110 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో మహ్మదుల్లా, ముష్ఫికర్‌రహీమ్ ఇన్నింస్త్ర్స నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆరోవికెట్‌కు 58 పరుగులు జోడించాక రహీం ఔటయ్యాడు. అయితే మహ దుల్లా మాత్రం ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆతిథ్య జట్టు స్కోర్ 200 దాటిం ది. చివర్లో సొహగ్‌గజీ కూడా వేగంగా ఆడి 30 పరుగులు సాధించాడు. మొత్తం మధ్యలో తడబడినా మహ దుల్లా హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో నరైన్ 4, పెరుమాల్ 2, సామి 2 వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0 ఆధిక్యంలో ఉంది.