సుప్రీంను తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్‌

కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి యనమల

అవాస్తవాలు దాఖలు చేశారని విమర్శ

అమరావతి,జూలై5(జ‌నం సాక్షి ): ఏపీ పునర్వవస్థీకరణ చట్టం అమలు గురించి దాఖలైన పిల్‌పై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పునరావాస ప్యాకేజీ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. తొలి ఏడాది ఆర్ధికలోటుపై అరుణ్‌ జైట్లీ చెప్పిన ఫార్ములా గురించి అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో ఆర్‌ అండ్‌ ఆర్‌ గురించి స్పష్టత ఇవ్వలేదన్నారు. 14వ ఆర్ధిక సంఘం 42 శాతం వాటా ఇచ్చింది కాబట్టి ఏవిూ ఇవ్వాల్సిన పనిలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇస్తామని చెప్పింది ఏమిటి..? అఫిడవిట్‌ కేంద్రం పేర్కొన్నదేమిటని దుయ్యబట్టారు. చట్టంలో చెప్పిన దానికి, అఫిడవిట్‌లో పెట్టినదానికి ఏవిూ పొంతన లేదన్నారు. అఫిడవిట్‌లో ప్రత్యేక ¬దా ఇచ్చేది లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. చట్టం గురించి చెప్పమంటే 14వ ఆర్థిక సంఘం గురించి చెబుతున్నారని, వెనుకబడిన జిల్లాలకు రూ.1050కోట్లు ఇచ్చి, ఇంకా భవిష్యత్‌లో ఇవ్వబోయేది మరో రూ.1050కోట్లు మాత్రమే అని అఫిడవిట్‌లో చూపిస్తున్నారని యనమల దుయ్యబట్టారు. షెడ్యూల్‌ 9,10 సంస్థల విభజన గురించి, ఉద్యోగుల విభజన గురించి మాటమాత్రంగా నైనా అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం తప్పించుకు తిరగడం కాదా అని యనమల ప్రశ్నించారు.ఏపీకి ఇంకా రావాల్సింది ఏమిటని అని తెదేపా డిమాండ్‌ చేస్తోందో, అవన్నీ ఇచ్చేశామని కేంద్రం అఫిడవిట్‌ లో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రజలనే కాదు న్యాయస్థానాలను కూడా పక్కదారి పట్టించడమేనని యనమల అన్నారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తామని యనమల స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడ వరద కాలువలకు ఇచ్చిన రూ.1000 కోట్లు కూడా రాజధానికి ఇచ్చినట్లు అఫిడవిట్‌లో చూపిస్తారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఏడాదికి రూ.333 కోట్ల చొప్పున రాబోయే మూడేళ్లలో3విడతలుగా ఇంకా కేవలం రూ.1000కోట్లు మాత్రమే ఇస్తామనడం ముమ్మాటికి ద్రోహమే అన్నారు. ఏడాదికి విూరిచ్చే రూ. 333 కోట్లతో మోదీ చెప్పిన దిల్లీని మించిన రాజధాని అమరావతి అవుతుందా? అని యనమల ప్రశ్నించారు. అఫిడవిట్‌కు అనుబంధంగా మంత్రిత్వ శాఖల ప్రెస్‌ రిలీజ్‌లు కోర్టుకు సమర్పించడం హాస్యాస్పదంగా ఉందని యనమల అన్నారు.