సుప్రీం జోక్యంతో కర్నాటకలో ప్రజాస్వామ్య విజయం

న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి):  కర్నాటక రాజకీయ వ్యవహారంలో సుప్రీం కోర్టు బాధ్యతగా వ్యవహరించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బలపరీక్షకు సుప్రీం ఆదేశించకుండా ఉండివుంటే పరిస్థితి మరోలా ఉండేది. చరిత్రలో సుప్రీం తీర్పు భావితరాలకు మార్గదర్శనం కానుంది. ఓరకంగా కర్నాటకలో  ప్రజాస్వామ్య బాధ్యతను తానే తీసుకుంది. బలపరీక్ష పారదర్శంగా జరగాలని ఆదేశించింది. సంఖ్యాబలం లేకపోయిన యడ్యూరప్పకు గవర్నర్‌ 15 రోజులు గడువు ఇచ్చారు. దీంతో సుప్రీం కోర్టు బలపరీక్షకు ఆదేశాలిచ్చింది. దీంతో సంఖ్యాబలంలో  తాము నిరూపించుకోలేమని యడ్యూరప్పకు ముందుగానే అర్ధమయ్యనట్లు ఉంది. అసెంబ్లీ సమావేశం మొదలైన వెంటనే ఉద్వేగంతో యడ్యూరప్ప మాట్లాడారు. బలపరీక్షకు ముందే రాజీనామా లేఖను ఇచ్చి  బయటకు వెళ్లిపోయారు. సుప్రీం ఆదేవాలతో లైవ్‌ ప్రసారం చేయడంతో ప్రజలు వీక్షించారు. అలాగే బేరసారాలకు అవకాశం లేకుండా పోయింది.
—————-