సుల్తాన్ బజార్ దోపిడి కేసును చేధించిన పోలీసులు
టైర్ల వ్యాపారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. దాడి జరిగిన 12 గంటలలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 లక్షల 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును చేదించామన్నారు.