సెటిలర్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా

5

ప్రభుత్వానికి ప్రాంతీయ బేధాలు లేవు

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సెటిలర్లు అంటూ ఎవరూ లేరు… ఇక్కడ స్థిరనివాసం ఉన్న వారంతా హైదరాబాదీలేనని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసంలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో కూకట్‌పల్లికి చెందిన వెయ్యికి మందికి పైగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ భేదం ఉండదని పునరుద్ఘాటించారు. ప్రాంతీయ భేదం లేదు కాబట్టే.. ప్రముఖ నిర్మాత రామానాయుడుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నమని తెలిపారు. విూరు సెట్లర్స్‌ కాదు..విూ తాతలు, తండ్రులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా హైదరాబాదీలేనని మరోసారి స్పష్టం చేశారు. సెటిలర్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని, ఇక నుంచి సెటిలర్లు అనే పదం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌లో స్థిరపడిన వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్‌, తెలంగాణ అభివృద్ధికి అందరం కృషి చేద్దామని కేసీఆర్‌ ప్రకటించారు. తాను పుట్టింది మెదక్‌లోనే అయిన హైదరాబాదీగానే ఉంటానన్నారు. ఇకపై ప్రాంతీయ విభేదాలు ఉండవని తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధప్రాంత వాసుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో భావోద్వేగంతో ప్రత్యేకమైన అభిప్రాయాలు వెల్లడయ్యాయని సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు.  హైదరాబాద్‌కు ఘన చరిత్ర ఉందన్న ఆయన మన బిడ్డల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సూచించారు. రాష్టాన్న్రి, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని..దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెటిలర్ల సమస్య పరిష్కారానికి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసుకుందామని కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు, ప్రజలకు సూచించారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో కూకట్‌పల్లికి చెందిన 12 కాలనీల వాసులు వెయ్యికి మందికి పైగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎంకేసీఆర్‌ అధికారిక నివాసంలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ బేధం ఉండదని పునరుద్ఘాటించారు. సెటిలర్ల సమస్య పరిష్కారానికి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసుకుందామని కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు, ప్రజలకు సూచించారు.