సెప్టెంబర్ 1న హైదరాబాదులో యూఎస్పిసి మహాధర్నా

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి ): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూఎస్పిసి స్టీరింగ్ కమిటీ నాయకులు జి.హరిలాల్ నాయక్,బి కిషోర్ సింగ్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లిలో ఉపాధ్యాయులకు జరుగుతున్న ఉన్నతి శిక్షణ కేంద్రాన్ని సందర్శించి ఉపాధ్యాయులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని, చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం లేదని,రోజు రోజుకు ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించబడకపోగా కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమమే శరణ్యమని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ను నియమించి ఐఆర్ ను ప్రకటించాలని, బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని,సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని,కాంట్రాక్టు ఉద్యోగ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసి ఆ వ్యవస్థను రద్దు చేయాలని,జీవో 317 బాధిత ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని,ఇన్కమ్ టాక్స్ మినహాయింపు పరిమితిని 8 లక్షలకు పెంచాలని, స్పెషల్ టీచర్లకు రెండు నోసనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని, పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, ట్రెజరీలో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ సత్వరమే చెల్లించాలని,01.09.2004కు ముందే నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపిఎస్ అమలు చేయాలని, సీఎం హామీ మేరకు 5571 పిఎస్ హె�