సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 15 (జనం సాక్షి);
సెప్టెంబర్ 17 ముమ్మాటిక విగ్రహ దినమే అని సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా డివిజన్ సహాయ కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ ,పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు హాలీమ్ పాషా అన్నారు.
వారు మాట్లాడుతూ సెప్టెంబరు 17 ని అధికారం కోసం బిజెపి టిఆర్ఎస్ పార్టీలు మతాలు, ఆధిపత్యం కోసం విమోచన , విలీనం అని రకరకాల పేర్లతో ప్రజలందరినీ గందరగోళానికి గురి చేస్తున్నటువంటి విధానాలను, వాటి రాజకీయ ఎత్తుగడలను కచ్చితంగా ఖండించాల్సిందేనని,అధికారం కోసం ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టే బీజేపీలాంటి పార్టీ సెప్టెంబర్ 17 విమోచన అని ప్రగల్భాలు పలుకుతున్నరని,ఉన్న సీఎం సీటుని కాపాడుకునే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ కూడా ఇది విలీన దినం దీన్ని అధికారికంగా నిర్వహిస్తామని బహటంగానే చేస్తున్నారనీ, వాస్తవంగా వీరిద్దరు చెప్పుచున్నది ముమ్మాటికి అబద్ధం ప్రజలపై పెత్తనం చేసి రైతాంగ పోరాటాన్ని అణచివేసిన సందర్భాన్ని పక్కదారి పట్టించడం మే ఈ పార్టీల యొక్క ప్రధాన లక్ష్యం అని, హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా మెజారిటీ తెలుగు ప్రజలు నివసించే తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యశక్తుల నాయకత్వంలో ప్రజలు ఆంధ్రమహాసభ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ సంస్థ నాయకత్వంలో మొదటగా గ్రంథాలయోద్యమం పేరుమీద తెలుగు జాతి అభివృద్ధి కోసం ప్రారంభించారని, తర్వాత ఈ సంస్థలో కమ్యూనిస్టు పార్టీ చేరి గ్రంథాలయ ఉద్యమంతో పాటు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, రైతుల నుంచి బలవంతంగా లేవి ధాన్యపు వసూళ్లకు వ్యతిరేకంగానూ జరిగే ఉద్యమాలకు నాయకత్వం వహించారనీ వారన్నారు.
సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా పార్టీ గా సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినంగా జరపాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగిందని,అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విద్రోహ దినం జరపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి హరీష్, ప్రేమరాజు, శ్రీనివాస్, జమన్న, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు.