సెబీ లో ఏర్గట్ల వాసికి గ్రేడ్ “ఏ” ఆఫీసర్ గా ఉద్యోగం
దిశ, మోర్తాడ్ : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎట్టెం అభిజ్ఞు యాదవ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లో గ్రేడ్ “ఏ”ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించారు. అయితే అభిజ్ఞు యాదవ్ సంపాదించిన ఉద్యోగం ఇండియా మొత్తం లో ఏడు ఉద్యోగాలు మాత్రమే ఉండగా, అందులో ఒక ఉద్యోగాన్ని అభిజ్ఞు సాధించారు. కాగా ఐఐటీ చెన్నై లో బిటెక్ పూర్తి చేసి, ఆ తర్వాత ఎంఏ ఎకానమిక్స్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పిఎచ్ డి లో నలభై ఐదువేల ఉపకార వేతనం పొందుతున్నారు. గతంలో ఆర్బీఐ గ్రూప్ “బి” ఆఫీసర్ గా రెండు ఇంటర్వ్యూ లు, నాబార్డ్ ఆఫీసర్ “ఏ”లో ఒకసారి, “బి”లో రెండుసార్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆఫీసర్ గా ఒకసారి మొత్తం ఏడు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఆర్బీఐ ఇంటర్వ్యూ లో మరోసారి హాజరు కావాలని ఆర్బీఐ నుండి పిలుపు వచ్చింది. కాగా అభిజ్ఞు తండ్రి ఎట్టెం రవీంధర్ యాదవ్ నల్గొండ జిల్లా విజిలెన్స్ లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తుండగా, తల్లి అఖిల యాదవ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అదే జిల్లాలో పనిచేస్తుంది. అభిజ్ఞు చదువులో మొదటి నుండి చురుకుగా ఉన్న వీరి కుటుంబంలో మొదటి నుండి వీరి వంశీకులు, కుటుంబ నేపథ్యం ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. సెబీలో ఉద్యోగం పొందిన అభిజ్ఞు యాదవ్ ను మండలంలోని ప్రజా ప్రతినిధులే గాక ఏర్గట్ల గ్రామ వాసులు అభినందిస్తున్నారు.

Attachments area