సెల్ఫీలు దిగిన విమాన పైలట్ల సస్పెన్షన్స్‌

న్యూఢిల్లీ,మే30(జ‌నం సాక్షి): విమానంలో సెల్ఫీలు తీసుకోడంపై విధించిన నిషేధాని ఉల్లంగించిన పైలట్లపై వేటు పడింది. సెల్ఫీలతో ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర విమానాయ శాఖ దీన్ని అరికట్టేందుకు సెల్ఫీలను నిషేధించింది. అయినా విమాన సిబ్బంది మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు./ూజాగా ట్రైనింగ్‌ విమానంలో సెల్ఫీలు దిగిన నలుగురు పైలట్లపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ వేటు వేసింది. ఎయిర్‌లైన్స్‌ నియమావళికి విరుద్ధంగా పైలట్లు సెల్ఫీలు దిగారు. వేటు పడిన పైలట్లలో సీనియర్‌ ఇన్‌స్టక్టర్ర్‌ లెవల్‌ కమాండ్‌తో పాటు మరో ముగ్గురు ట్రైనీలు ఉన్నారు. లేహ్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ట్రైనింగ్‌ఫ్లైట్‌ లో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్‌ 19న జరిగిన ఈ ఘటనపై జెట్‌ ఎయిర్‌వేస్‌ దర్యాప్తుకు ఆదేశించింది.2014లో కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు రూల్స్‌ ను ఉల్లంఘించారు. ఫ్రెండ్స్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత డ్యూటీలో ఉన్న పైలట్లతో ఫోటోలు దిగారు.