సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.
టి. రంగారావు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ త్ నియంత్రణ మండలి చైర్మన్
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 20. (జనం సాక్షి). సెస్ అభివృద్ధి కోసం సభ్యులు చేసిన ప్రతిపాదనలు పరిశీలించి ఆచరణ లోకి వచ్చేలా చూస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో సెస్ 2023-24 వార్షిక ఆదాయం ఆవశ్యకత పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. చైర్మన్ టి రంగారావు దృష్టికి ప్రతినిధులు సేస్ లో ఎదుర్కొంటున్న సమస్యలనుతీసుకువచ్చారు.రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందనడం లో నిజం లేదని పలు సభ్యులు ప్రస్తావించారు. సంస్థగతమైన అంశాలను పలువురు సభ్యులు వివరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని, సెస్ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. పలురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ డిస్కమ్ లు,సెస్ పైలాను అనుసరించే నిర్ణయాలు చేయడం జరుగుతుందని తెలిపారు. 70 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నాయని రికవరీ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 71% వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని 29% ఇతర అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సభ్యుల సహకారం నియంత్రణ మండలి సూచనలతో రానున్న రోజుల్లో సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. బహిరంగ విచారణలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి టెక్నికల్ సభ్యులు ఎండి మనోహర్ రాజు, డి కృష్ణయ్య,సెస్ ఎండి. అధికారులు సెస్ పాలకవర్గ సభ్యులు వినియోగదారులు ప్రతినిధులు పాల్గొన్నారు.