సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలి
నిజామాబాద్,మార్చి29(జనంసాక్షి): రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకుంటే తప్ప వ్యవసాయంలో పురగతి సాధించలేరని వ్యవసాయాధికారులు సూచించారు. వ్యవసాయంలో పురగు,ఎరువు మందుల వాడకం వల్ల విపరీతమైన పెట్టుబడి పెట్టాల్సి వస్తోందిని అన్నారు. ఎండాకలం నుంచే ఎరువుల తయారీ సిద్దం కావాలన్నారు. వానాకాలనికి పనికి వచ్చేలా ప్రణాళిక చేయాలన్నారు. అధిక దిగుబడుల కోసం చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు భూమి సత్తువను దెబ్బతీస్తోందన్నారు. సాగులో రైతులు పంటలు పండించేందుకు సేంద్రియ ఎరువుల వినియోగంతోనే భూమికి మేలు జరుగుతుందని రైతులకు సూచించారు. వరి, పత్తి, మిరప,కంది తదితర పంటల సాగులో రైతులు మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించడం వలన భూమి సారం కోల్పోతోందన్నారు. రసాయన మందుల వినియోగంతో పండించిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనుషులపై ప్రభావం చూపుతున్నాయి. భూమిని సారవంతంగా ఉంచేందుకు సేంద్రియ ఎరువులు వినియోగించాలన్నారు. రైతులంతా భూముల్లో మట్టి పరీక్షలు చేయించి అవసరం మేరకు మాత్రమే ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం ఇందుకుఅనేకవిధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోకుంటే భూమి చేతికి రాదన్నారు.