సేఫ్‌ జోన్‌లో ఇంగ్లండ్‌

రెండో ఇన్నింగ్స్‌లో 161-3        165 పరుగుల ఆధిక్యం

భారత్‌కు కష్టకాలం          ఇంగ్లండ్‌ వశం కానున్న సిరీస్‌

నాగ్‌పూర్‌: నాల్గో టెస్టులోనూ ఇంగ్లండ్‌ ఆధిక్యత కొనసాగుతోంది. చివరి టెస్ట్‌ నాల్గో రోజు సైతం ఇంగ్లాండు జట్టు తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారత్‌పై 165 పరుగుల ఆధిక్యతతో కొనసాగుతోంది. నాగ్‌పూర్‌ టెస్ట్‌ మాచ్‌ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 161 పరుగుల చేసింది. ఫలితంగా 165 పరుగుల ఆధిక్యతను కూడగ ట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ తన మూడు వికెట్లను 94 పరుగులకే కోల్పోయింది. అయితే ఇంగ్లీష్‌ ఓపెనర్లు కుక్‌ 13, కాంప్టన్‌ 34, పీటర్సన్‌ 6 పరుగుల చొప్పన చేశారు. అయితే ట్రాట్‌ 66, బెల్‌ 24 పరుగులతో వికెట్ల పతనాన్ని అడ్డుకుని క్రీజ్‌లో పాతుకుపోయారు. భారత బౌలర్లలలో ఓఝా, అశ్విన్‌, జడేజాలు ఒక్కో వికెట్‌ చొప్పన తీశారు. అంతకుముందు నాగ్‌ పూర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తోనూ జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సాహాసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 330 పరుగుల స్కోరుకు మరో నాలుగు పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను 326-9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాం డ్‌ నాలుగు పరుగుల ఆధిక్యంతో ఉంది. ఆదివారం ఉదయం ఆట 297-8 పరుగులతో ఆటను ప్రారంభించిన భారత్‌ కాసేపటికే స్పిన్నర్‌ (3) ఓజా 317 పరుగు వద్ద ఔటయ్యాడు. ఇషాంత్‌ శర్మ (2), అశ్విన్‌ (29)తో ఆడుతుం డా ధోనీ డిక్లేర్‌ చేశాడు. అంతకు ముందు నాలుగు వికెట్ల నష్టానికి 87 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరు తో భారత్‌ మూడో రోజు బ్యాటిం గ్‌ దిగిన భారత కోహ్లీ సెంచరీ (103) చేయగా, ధోనీని 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్న విషయం తెల్సిందే. నాల్గో టెస్టులోనూ ఇంగ్లండ్‌ ఆధిక్యత కొనసాగుతోంది. ఆచితూచి ఆడుతూ వచ్చిన విరాట్‌ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 198 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెయిల్‌ ఎండ్‌ బ్యాట్స్‌మెన్లు జడేజా 12, అశ్విన్‌ 29 (నాటౌట్‌), చావ్లా 3, ఇషాంత్‌ శర్మ 2చొప్పన పరుగలు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌ నాలుగు వికెట్లు తీయగా శ్యాన్‌ 3, పనేసర్‌ ఒక వికెట్‌ చొప్పన తీశారు.