సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని తండా తండాల్లో ఘనంగా నిర్వహించుకుందాం

– సమాజ ఐక్యమత్యాన్ని చాటుదాం- అభివృద్ధికై పాటుపడుదాం…
– సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో – నవ సమ సమాజాన్ని సాపిద్దాం -సేవా అభివృద్ధికై పాటుపడుదాం..
– సమాజ ధర్మ పరిరక్షణ కోసం సేవాలాల్ మహారాజ్ కృషిని ఆదర్శగా తీసుకుందాం..
– సేవాలాల్ చూపించిన బాటలో ప్రయాణిద్దాం- బంజారా సంస్కృతి సాంప్రదాయాలని, భాషను కాపాడుకుందాం…

– సేవాలాల్ మహారాజ్ ఆశయాలకై సేవాఅంకితభావంతో- సేవా చేద్దాం..
– మన తండాల హక్కుల పరిరక్షణకై – మనమే కథానాయకులు అవుతాం..
– తండా పంచాయతీ ఎన్నికల్లో తండాలని ఏకిగ్రీయం చేసుకుందాం- అభివృద్ధికి పాటుపడదాం

సేవా” లాల్ – తన పేరులోనే సేవ మారుపేరుగా నిలిచిన సేవాలాల్ తన ఆచరించిన ఆచరణలో కూడా సేవా సద్గుణాలు పుష్కలంగా ఆచరణలో పెట్టి నేటి నవ సమాజానికి స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్. మహరాజ్ కు మారుమూల తండా నుంచి విశ్వవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల్లో ఆరాధ దైవంగా కొనియాడ పడుతున్నరు మహనీయుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. వారి చారిత్రక నేపథ్యం వారు తండాల్లో తీసుకువచ్చిన ఆధ్యాత్మిక మార్పులు బంజారా ధర్మ పరిరక్షణ కోసం చేసిన కృషి ఎనలేనిది బంజారా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పారతులి బంజారా సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించిన మహనీయుడు బంజారా సంస్కృతి విచ్ఛిన్నమవుతున్న తరుణంలో బంజారా సంస్కృతి సాంప్రదాయాలు బంజారా ధర్మ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సద్గురు సేవాలాల్ మహారాజ్ సేవల గురించి వారి మహిమల గురించి వారు చేపట్టిన సంస్కరణల గురించి చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు సంస్కరణలు చేపట్టి సమసమాజ స్థాపన కోసం నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినా మహనీయుడు సేవాలాల్ మహారాజ్ వారి ఆశయాలను వారి సేవలు మార్గంలో ప్రయాణించి నిస్వార్థులుగా సార్ధగతులవుదాం

ఈ సృష్టి మీద రోజుకు ఎందరో పుడుతూ ఉంటారు ,ఎందరూ గిడ్డుతు ఉంటారు . అందులో కొందరు మాత్రమే మహనీయులుగా
అవతారపురుషులుగా ఆరాధ్యదైవాలు చరిత్ర పుట్టలో నిలిచి, చరిత్రను తిరగరాసి ఆదర్శవంతులుగా సమాజంలో నిలుస్తారు. మరికొంతమంది మాత్రం చరిత్ర సృష్టింస్తారు.. ఆ కోవకు చెందిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్…
తన జీవిత కాలంలో ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ స్వశక్తితో జీవించే మార్గాన్ని చూపిస్తూ తండా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను సాంఘిక దురాచారాలను పారదూలి సమాజంలో ఉన్న నిరక్షరాస్యుతను, ఆర్ధిక అసమానత్వం తో కృంగిపోతున్న సమాజాన్ని రూపుమాపడానికి అనేక సంస్కరణలు ఉద్యమం లాగా చేపట్టి తండా తండా తిరిగి చైతన్యం పరుస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తన జీవితాన్ని త్యాగం చేసినా త్యాగ పురుషుడు సమాజ సేవ కోసం అంకితం చేసిన మహనీయుడు సేవాలాల్ తన పేరులో ఉన్న సేవాభావాన్ని మాటల్లో చెప్పకుండా తాను అనుకున్న ప్రతి పనిని ఆచరణలో చేస్తూ ప్రజల మనలను . పొందారు.దేశవ్యాప్తంగా ప్రజల ఆరాధ్యదైవంగా నేడు
కోలువాబడుతున్నారు అందుకే నేడు వారిని ఆదర్శంగా తీసుకొని బంజారా సమాజంలో ఐక్యమత్యం గా ముందుకు సాగుతుంది అని భావించవచ్చు. తండాల్లో యువత మన తండాలకు మనమే కథానాయకుల అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది

సేవాలాల్ మహారాజ్ భక్తజనుల ఆరాధ్యదైవంగా దేశవ్యాప్తంగా బంజారా సమాజంలో భగవత్ స్వరూపుడిగా అవతార పురుషుడిగా సామాజిక కాంతి వీరుడుగా పూజించబడుతున్న ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆనాడు
సమాజంలో ఆ శాంతి సంక్షోభంతో ఉన్నప్పుడు తన ధర్మ బోధనల ద్వారా జాతిని ధర్మమార్గంలో నడిపించి జాగ్రత్త పరిచి బంజారా సమాజంలో ఆదర్శం ఐక్యమత్యాన్ని చూపించిన బంజారా జాతి యొక్క శక్తిని శాంతిని ఉత్సాహాన్ని ఐక్యమత్యాన్ని పెంపొందించు తపస్వి దైవం సంభూత సంపన్నుడు బంజారా జాతిని దశ దిశా నిర్దేశిస్తు సంరక్షిస్తున్న దైవం శ్రీ భగవాన్ సేవాలాల్ మహారాజ్ గారు బంజారా జాతీలో అతి చిన్న వయసులోనే తన అమూల్యమైన సందేశం తో దశ దిశా నిర్దేశస్తూ సమాజంలో అనేక సామాజిక సంస్కరణలు చేపట్టి నిరంతరం సమాజసేవ వారికి తన జీవితాన్ని త్యాగం చేసి దైవ సన్నిధి చేరిన్నారు.ఆయన మార్గాన్ని ఆదేశిక సూత్రాలను పాటించి పుణ్యాత్ముల అవుదాం…
సమస్త జీవకోటికి మాతృ రూపం తల్లిగా వెలసిన అమ్మ భవాని గురించి అమ్మను పూజించాలి కానీ ఫలితం ఆశించవద్దు నీ బంజారాలకు బోధించాడు.. సేవాలాల్ మహారాజ్ అహింసా పాపమని మత్తు ధూమపానం శాపమని హితువు పలికిన మానవుడు మహానుభావుడు బంజారా జాతికె కాకుండా యావత్ సమాజానికి ఆదర్శ పురుషుడు అయ్యాడు సేవాలాల్ మహారాజ్ ఆనాడు బంజారా జాతి పేరు ప్రతిష్టలను గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి తన జీవిత కాలంలో ఆచరణలో చూపెట్టి ప్రతి ఒకరు బంజారాలు హింస మత్తు పానీయాలకు బానిస కాకూడదని హితవు పలికాడు. ఆచరణలో బంజారా సమాజం వ్యాపారం నియమితం యుద్ధ సామాగ్రి లు, ముడి సరుకులు తరలించుడం కోసం స్థిర నివాసం లేకుండా దేశం వ్యాప్తంగా బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు అవసరమైన యుద్ధ సామాగ్రిని ఆయా ప్రాంతాలకు చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు ఆ క్రమంలో బ్రిటిష్ పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయింది ఈ పరిస్థితుల్లో జాతి యావత్తు అంధకారంలో ఉన్నప్పుడు ఆ జాతిని సరైన మార్గంలో నడిపించుటకు కొందరు దైవ సంభూతులు ఈ భూమ్మీద జన్మిస్తారు
సేవాలాల్ మహారాజ్ బోధనల ద్వారా బంజారా జాతిని పురోగమిస్తుంది దేవత అనుగ్రహంతో జన్మించిన వారు కారణజన్ములు వారి జన్మకు సార్థకత ప్రయోజనం ఉంటుంది. ఇలా ఒక జాతి లో ఒక మహిమానిత్వాతులు జన్మించి సమాజచే వారు దైవ సంభూతులు గా ఆరాధింపబడుతారు. అలాంటి కోవకు చెందిన భగవాన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారా లకు ఆరాధన దైవముగా వెలుగొందుతున్నారు. ఈ దుర్భర స్థితిని తొలగించి సామాజిక ఇలా అనేక సంస్కరణలు ద్వారా మార్పు చేసి బంజారాలను చైతన్యపరిచి అభివృద్ధి బాటలో నడిపించుటకు సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిమీద ఉద్భవించిన భగవతుని అవతారాలు ఆరాధ్య లు గురువులు గా నిలిచారు.
బంజారా తండాలో పరిస్థితులు అస్తవ్యస్తమైన సమస్యలు ఎదుర్కుంటూ బతికేవారు అప్పుడు సప్తమాతలకు తండా ప్రజలందరూ కలిసి మా బంజారా జాతీయ ఐక్యం చేసి ఒకతాటిపై తీసుకు వచ్చే మహానుభావుడికి వరం ఇవ్వమని
సాత్ భవానీలను వేడుకుంటారు అప్పుడు బంజారాలకు ఆ మహా పురుషుడికి అందించాలనే పదేపదే వేడుకుంటారు ప్రార్థిస్తారు ఆ క్రమంలో స్వాత్ భవానీలు అనుగ్రహంతో బంజారా ప్రజల కోరిక మేరకు మహానుభావుని వరంగా ఇస్తారు. ధర్మనీ భీమానాయక్ దంపతులు సంతానం లేక తపస్సు చేస్తుండేవారు ఈ క్రమంలో సప్తమాతృకలు భవాని విధించిన షరతులను స్వీకరించడానికి కూడా సిద్ధం అవుతారు అప్పుడు వారి కుటుంబానికి సంతానాన్ని ప్రసాదిస్తారు ఆ వరప్రసాదంగా జన్మించిన పుత్రుడే సేవలాల్ పిలువబడుతున్నారు
అయితే సేవాలాల్ మహారాజ్ జననం 17 39 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా రాంజీ నాయక్ తండ లో జన్మించాడు ఈయనకు సేవాలాల్ అని నామకరణం చేశారు సేవాలాల్ పెరిగిన తర్వాత కొంత కాలం లో మేరమ్మ గా పిలవబడే జగదాంబ ప్రత్యక్షమై సేవాలాల్ పైన అమ్మవారి అనుగ్రహంతో తో శక్తి మహిమలను ప్రసాదిస్తూ సేవాలాల్ మారాజ్ కి ముందుకు నడిపిస్తారు
అంతేకాకుండా సంత్ సేవాలాల్ మహారాజ్ మహిమలు అద్భుతమైనవి వీటి మీద అనేక కథనాలు కలవు వాటిలో పురుషుని స్త్రీ గా మార్చడం. ఒక ముంతా బియ్యం తో 1000 వంద మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు నెలల తర్వాత బతికించడం. విషం కలిపిన తీపి వంటకాలు నిర్వీర్యం చేయడం, వాగులు నీళ్ల ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను ఆవులను దాటించడం, సేవాలాల్ లకు అపకీర్తి తీసుకురావాలని చేసిన వారి కుట్రలను పటాపంచలు చేయడం, అద్భుతమైన మహిమలు కలవాడు సేవాలాల్ ఆయన ఆజన్మ బ్రహ్మచారి పుట్టుకతోనే దేవి సంపాదన కలవాడు నీ స్వార్ధపరుడు ఆజానుబావుడిగా ప్రకాశిస్తూ బంజారా సంస్కృతి పరిరక్షణకు ధర్మరక్షణకు బంజారాలకు సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని బంజారా ధర్మాన్ని కాపాడడానికి మొదటి జన్మనెత్తిన ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్.
మహారాజ్ సమాజ నికి ఆధ్యాత్మిక బోధనలతో పాటు శాకాహారి గా, మూఢనమ్మకాలు ,మత్తు పానీయాలు కు వ్యతిరేకంగా సాంఘిక దురాచారాలను, రూపుమాపడానికి అనేక సంస్కరణలు చేపట్టారు. అలాగే అహింసావాది గా నేటి సమాజానికి కావలసిన ఆత్మస్థైర్యానికి కల్పించిన వ్యక్తిగా భావించవచ్చు. ఆధ్యాత్మిక భక్తి శక్తులతో చివరి వరకు అంకితభావంతో నిజాయితీ కి కట్టుబడి బంజారా జాతి ఆత్మగౌరవాన్ని తెచ్చి పెట్టిన మహారాజుగా చెప్పవచ్చు. వారు చూపిన బాటలో ప్రయాణించి వారి ఆశయ సాధన లో ని అందరూ భాగస్వాములై బంజారా సంస్కృతి, భాష , ధర్మ పరిరక్షణకు, నిరక్షరాస్యత నిర్మూలన అక్షరాస్యత పెంపొందించడం మూఢనమ్మకాలను రూపుమాపడం ఇలాంటి అనేక అంశాలను నుంచి సమాజాన్ని విముక్తి పొందడానికి అందరు తమ బాధ్యతగా భావించాలి. అప్పుడే సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు నిజమైన సార్థకత ఉంటుందని ఆశిద్దాం…
సమాజంలో జరుగుతున్న దురాచారాలను స్వస్తి చెపుతూ సమసమాజ స్థాపన పై అందరూ భాగస్వాములు కావాలి. ఈ క్రమంలో లో బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అంతరించిపోతున్న సంస్కృతి పరిరక్షణకు అందరూ పాటుపడాలి. సేవాలాల్ స్ఫూర్తితో ఐక్యమత్యంతో పని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. కనుక ప్రతి తండాలో యువతే కథానాయకులగా, మార్గదర్శకులుగా తమతమ తండాల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి మహా భోగ్ బండరో కార్యక్రమాన్ని నిర్వహించి. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక భాష, వేషధారణ, పండుగలు ఆచారాలు సంప్రదాయాలు తో కూడిన ఆరాధన నైవేద్యం వీటి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటే విధంగా జయంతి పండుగ జరుపుకోవాలి…

గిరిజనులకు మహారాజ్ సేవలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పండుగను గుర్తించి ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం బంజారా జాతికి ఆత్మగౌరవానికి గుర్తించారని చెప్పవచ్చు. భారత దేశ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల జనాభా ఉన్న బంజారాలకు ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ జయంతి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా చేపట్టడం బంజారా కు ఇది గర్వకారణం . జయంతి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే సేవాలాల్ జయంతిని అధికారికంగా చేపట్టడం శ్రీకారం చుట్టారు. ఆనాడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కలలు కన్న కలలు ఇప్పుడిప్పుడే సహకారం అవుతున్నాయి మా తండాలో మా రాజ్యం ఎన్నో ఏళ్ల కల రాష్ట్రంలో అనేక తండాల గ్రామపంచాయతీ ఏర్పడి సహకారం అయిన వేళ కొత్త పాలక మండలి లో సేవాలాల్ మహారాజ్ ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో నవ యువ నాయకులు ప్రతి తండాలో ఇవాళ అభివృద్ధికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది. మా తండాను మేమే స్వయం పాలనతో పాలించు ఉంటున్నామని ఆనందోత్సవాలు తండాల్లో కనిపిస్తుంది. ఆ రోజు తండా తండా తిరిగి ప్రజలను చైతన్య పరుస్తూ తండా లో ఉన్న మత్తుపానీయాలు మూఢనమ్మకాలు సామాజిక సంస్కరణలు చేపట్టి తండా ప్రజలకు దశ దిశ నిర్దేశించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ జయంతిని గుర్తించి ఇవాళ గౌరవించుకోవడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి తండాల గ్రామపంచాయతీ లో సేవాలాల్ మారాజ్ బండార్ కార్యక్రమం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటున్నారు సేవాలాల్ చూపిన బాటలో పయనించి తండాల్లో ప్రతి ఒక్కరు నిరక్షరాస్యులను రూపుమాపి అక్షర శాతాన్ని పెంపొందించి ప్రతి ఒక్కరు చదువుకునే లాగా అన్ని రంగాల్లో రాణించాలని యువత మన తండాలకు మనమే కథానాయకులుగా వహించి భాషా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ జాతి ఐక్యత కోసం పాటుపడి అప్పుడే నిజమైన సేవాలాల్ మహారాజ్ జయంతికి భోగ్ బండారో, నివాళులు అర్పించిన వాళ్ళమవుతాం. అలాగే సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో మన తండాల్లో మనమే కథానాయకులై కాలక్రమేనా పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులను పసిగట్టి బంజారా సమాజం బంజారా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని పోటీపడే ఆసక్తిని పెంపొందించుకొని సమాజ మార్పు కోసం సమాజంలో ఉన్న నిరుద్యోగ నిర్మూలన ,ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత నిర్మూలన, అక్షరాస్యత పెంపొందించుకోవడం వైపు అడుగులు వేస్తూనే యువత మానవనులుగా తయారు కావాలి. సమాజ పురోగతి కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించడం వైపు ప్రయాణించాలి ఈ క్రమంలో అందరూ చదవాలి అందరూ చదువుకోవాలి అందరూ ఎదగాలి అనే సంకల్పంతో సమాజాన్ని ఒక దశ దిశ నిర్దేశిస్తూ గిరిజన తండాల్లో కూడాల్లో నిరక్షరాస్య రహిత తండాలుగా గూడాలుగా తీర్చిదిద్ది మూఢనమ్మకాలు అసాంఘిక కార్యకలాపాల రూపుమాపడానికి 285 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ నియమాలు నిబంధనలు పాటించి ఎంతో పవిత్రమై గా సేవాలాల్ మహారాజ్ జయంతి పండుగను అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా సేవాలాల్ మారారు జయంతి జరుపుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పతి గడపగడప ప్రతి తండాల గ్రామపంచాయతీలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో ప్రతి చోట సేవాలాల్ మహారాజ్ బోగ్ బండారు కార్యక్రమాన్ని నైవేద్యం సమర్పించి బండారు కార్యక్రమం ఎక్కువ నియమ నిబంధనలు పాటించి సేవాలాల్ మారాజు 285వ జయంతి పండుగను ఘనంగా నిర్వహించుకుందాం – సమాజ అభివృద్ధికై బాటలేద్దాం..

శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని యావత్ భారత దేశం వ్యాప్తంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ తండా తండా తిరిగి అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణల ద్వారా తండాల్లో బంజారా ధర్మ పరిరక్షణ కోసం బంజారా లు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం ద్వారా బంజారా లు తమ సంస్కృతి , భాష ను కాపాడుకోవడం ద్వారా రాబోయే తరాలకు ఒక చక్కటి ఐక్యమత్యాన్ని చాటడం కోసం ఆ రోజు లోనే సేవాలాల్ కృషి చేసిన మహనీయుడు . సేవాలాల్ మహారాజ్ నేటితరం యువత ఉద్యోగులు మేధావులు కవులు కళాకారులు ప్రజలు యావత్ సమాజం శ్రీ సేవలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో నడిచి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేవాలాల్ మహారాజ్ ఏమి ఆశించకుండా తండా ప్రజల బాగోగుల కోసం సమాజాన్ని ఏకం చేసి సమాజంలో ఉన్న వడిదడుగులను రూపుమాపడం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహారాజ్ అలాంటి సేవలను స్ఫూర్తిగా నేటితరం యువ సమాజం యువత అన్ని శక్తులు ఏకమై మారుతున్న కాలం అనుగుణంగా ఈ పోటీ ప్రపంచయుగంలో మనం కూడా ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా టెక్నాలజీకి అనుగుణంగా పోటీపడి ఈ సమాజంలో తట్టుకునే శక్తి సామర్థ్యం నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా మన సమాజాన్ని ఎప్పటికప్పుడు దశాదిశాన్నిదేశిస్తూ సేవాలాల్ మహారాజ్ వారసుడు అంటే ఎందులో వెనకడుగు ఉండకూడదనేది నా ఆశయం నా లక్ష్యం ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ సాతిభవాని రా సప్తమాతల ఆశీస్సులతో మనం నిరంతరం కష్టపడి సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా మెలగాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. చరిత్ర పుటలో ఎవరి చరిత్రను పరిశీలించిన కొందరు మాత్రం చరిత్రను సృష్టిస్తారు అందులో వారే చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించబడతారు ఆ కోవలో సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను కొనియాడ బడుతుంది. అలాంటి సేవాలాల్ మహారాజుని మనం కూడా అంకిత భావంతో కూడుకున్న సేవను మనలో మలుచుకొని ఈ సమాజాన్ని ఒక దశాదిశాను నిర్దేశించే స్థాయిలో యువత మన గ్రామాలకు మన తండాలకు మన గూడాలకు మనమే కథ నాయకులు కావాలి. ఎందుకంటే ఇవాళ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర అనేక గ్రామాల్లో గూడాల్లో తండాల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వం కూడా జాతీయస్థాయిలో సెలవు దినం ప్రకటించాల్సిన దిశగా మనం పని చేయాలి. శ్రీ సంసేవలాల్ మహారాజ్ జయంతి గత పది సంవత్సరాల నుంచి అధికారికంగా నిర్వహిస్తున్న అక్కడక్కడ చైత్ర స్థాయిలో సేవాలాల్ మహారాజ్ జయంతి అంటే ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా కూడుకున్న భోగ్ బండారో కార్యక్రమం నిర్ణయించుకోవాలి కానీ కొంతమంది తెల్వక సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కేకులు కట్ చేయడం పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది సరైనది కాదు. మన బంజారా సాంస్కృతి ప్రకారంగా మహారాజుది భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మన గ్రామాల్లో మనకు దగ్గరలో ఉన్న సాధువులకు మహనీయులకు మేధావులకు కళాకారులకు, ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ అంశాల పట్ల మన ప్రజలకు చైతన్యం చేసి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది

ఫిబ్రవరి 15వ తారీఖున నిర్వహించే సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి కార్యక్రమాన్ని పత్తి తండాల్లో గడపగడపన భోగ్ బండారో ఘనంగా నిర్వహించాలి. . బంజారా సంస్కృతి విచ్ఛిన్నమవుతున్న క్రమంలో బంజారా సాంస్కృతిని, ధర్మాన్ని పరిరక్షించడం కోసం బంజారాల ఐక్యమత్యం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ చేసిన సేవల్ని కొనియాడుతూ, సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ఆనాడే బంజారా సమాజంలో తండా తండా తిరిగి చైతన్యం కల్పించడానికి సేవాలాల్ మహారాజ్ తండా తండా తిరిగి బంజారా తండాల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదోలి, మత్తు పానీయాలను రూపుమాపి బంజారా ధర్మ పరిరక్షణ దిశగా బంజారాలను సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన మహానీయుడు సేవాలాల్ మహారాజ్ .అలాగే ఆధ్యాత్మి మార్గంలో ప్రయాణించి బంజారాల ఐక్యమత్యం చాటి బంజారాల సంస్కృతి పరిరక్షించుకోవాలని సేవాలాల్ మహారాజ్ వారసులుగా వారి చూపిన సన్మార్గంలో ప్రయాణించి ఎలాంటి తప్పులు చేయకుండా సేవాలాల్ మహారాజ్ జయంతిని భోగ్ బండారో కార్యక్రమ ద్వారా సేవాలాల్ జయంతి నివాళులర్పించాలని విజ్ఞప్తి తప్పులు దొరలకుంట ఆధ్యాత్మికమైన మార్గంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించి బంజారా సమాజం యొక్క సాంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాల్సిన గురువు తర బాధ్యత ప్రతి తండాల్లో విద్యావంతులు మేధావులు కళాకారులు యువతపై బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. యువత తమ తండాలకు గూడాలకు తామే కథానాయకులై నిలవాలని కోరుతున్నను
మీ
డా. గుగులోతు శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర ఫార్మర్ ఆర్టిఐ కమిషనర్
9908817986