సైనాకు ప్రశంసల జల్లు
ఆస్ట్రేలియా ఓపెన్ సైనా కైవసం
సీజన్‌లో తొలి టైటిల్
ఒలింపిక్స్ ముందు వూరట
సైనాకు రూ.10 లక్షలు రివార్డు.. ప్రశంసలు
భారత అగ్రశేణి షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌ను కైవసం చేసుకొంది. ప్రపంచ 12వ ర్యాంక్ క్రీడాకారిణి సున్ యు (చైనా)ను మట్టికరిపించి సీజన్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా టైటిల్ సాధించిన సైనా నెహ్వాల్‌పై స్వదేశంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖలు సైనాను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సైనా కోచ్ విమల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కిక్రెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, వీవీఎస్ లక్ష్మణ్, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ తదితరులు సైనాకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఈ సీజన్‌లో ఆమెకిదే తొలి టైటిల్.