సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యం:జిల్లా ఎస్.పి. శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేస్తున్నామని ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ…. సైబర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అక్టోబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా “SEE YOUR SELF IN CYBER: TOGETHER WE MAKE IT SAFER”. అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం జరిగిందని, సైబర్ అవేర్‌నెస్ నెలలో భాగంగా షీ టీం మరియు కళాబృందం వారిచే మహిళా సేఫ్టీ వింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి సైబర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోందని ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వివరణాత్మక షెడ్యూల్ తయారు చేయబడిందని ఇందులో బాగంగా తేదీ: 21.10.2022 నాడు
1. సైబర్ ఫ్రాండ్ ,సాంప్రదాయ చీటింగ్ నేరాల కంటే పెద్ద ముప్పుగా ఉందా?
2. సైబర్ నేరాల వ్యాప్తికి కారణాలు మరియు సాధ్యమైన నివారణలు ఏమిటి?
3. CFCFRMS (సిటిజెన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ & మానేజిమెంట్ సిస్టమ్) ఇనిషియేటివ్, ఇది పౌరులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది (1930 నంబర్ మరియు T4C కార్యకలాపాలు చర్చించబడవచ్చు).
4. సైబర్ నేరగాళ్ల అభివృద్ధి చెందుతున్న ఇన్నోవేటివ్ మోడ్స్ ఆపరేండి, అధిక నిఘా అవసరం.
5. వివిధ రకాల సైబర్ నేరాల నుండి మహిళలు మరియు పిల్లల భద్రతకు ఉద్భవిస్తున్న ముప్పులు,
6. సైబర్ అవగాహన గురించి ఏదైనా ఇతర అంశం
అనే అంశాలపై ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నదని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 08452-221666 నంబర్ కి సమయం సాయంత్రం 04:00 నుండి 05:00 గంటల మద్య కాల్ చేయవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.
Attachments area
ReplyForward
|