సొంతగూటికి అమర్‌సింగ్
– రాజ్యసభకు పంపాలని ములాయం నిర్ణయం
లక్నో,మే17(జనంసాక్షి): యూపిలో మళ్లీ రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ములాయంకు, ఆయన పార్టీకి దూరంగా ఉన్న అమర్ సింగ్ మళ్లీ దగ్గరయ్యారు. అంతేగాకుండా ఏకంగా రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరునున్న నేపథ్యంలో అమర్ పక్కన ఉండాలని కోరుకుంటున్న ములాయం మళ్లీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో యూపీ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాష్టీయ్ర లోక్‌దళ్ పార్టీలో కొనసాగుతున్న అమర్‌సింగ్ మరోసారి సమాజ్‌వాదీ పార్టీ గూటికి చేరారు. అమర్‌సింగ్‌ను రాజ్యసభకు పంపుతామని ఎస్పీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఎస్సీ అధినేత ములాయం సింగ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు విూటింగ్‌లో రాజ్యసభకు ఏవరేవరిని పంపాలన్న అంశంపై చర్చించారు. అనంతరం ఏడుగురిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారిలో.. అమర్ సింగ్, బేణి ప్రసాద్ వర్మ, సంజయ్ సేత్, సుక్రంయాదవ్, విశంబర్ ప్రసాద్ నైషద్, అరవింద్ సింగ్, రేవితి రమణ్ సింగ్ ఉన్నారు. యూపీలో 11 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనికన్నా వచ్చేయేడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పావులు కదపాలంటే అమర్ ఉండాల్సిందే అని ములాయం గుర్తించారు.