సొంత నిధులతో బోర్లు వేయించిన కొండమల్లేపల్లి ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి (జనంసాక్షి) సెప్టెంబర్ 26: కొండ మల్లేపల్లి మండల పరిధిలోని గణ్యా నాయక్ తండాలో ఎంపిటిసి జగన్ లాల్ విజ్ఞప్తి మేరకు తండాలోని దేవాలయం మరియు తండా వాసుల కొరకు మండల ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి సుమారు రూ.1,00,000/-(ఒక లక్ష రూపాయలు) తమ స్వంత ఖర్చుతో వేయించిన బోర్ ను నేడు ఆదివారం రోజున ప్రారంభించడం జరిగింది.వాటర్ రావడంతో తండా వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ నీటి సమస్య కొరవడుతున్న సమయంలో బోర్ వేయించి ఆదుకున్నందుకు ఎల్ల వేళలా రుణపడి ఉంటామని అందుకు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములు,వైస్ ఎంపిపి కాసర్ల వెంకటేశ్వర్లు,చిన్న అడిసర్ల పల్లి ఉప సర్పంచ్ మూడావత్ మంగ్యా నాయక్,వార్డ్ సభ్యులు శంకర్,తార,బావోజీ,స్వామి,మంగ్తా,శ్రీకాంత్,రమేష్,సైది,కిట్టు,లక్ష్మణ్,తుకారాం,కోమిటి,మారు,యం.డి ఖధీర్,రామావత్ సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.