సొంత పనులకు పంచాయితీ ట్రాక్టర్…

కేసముద్రం అక్టోబర్ 16 జనం సాక్షి / గ్రామీణ పల్లెలు పరిశుభ్రంగా ఉంచుకోవలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ల ను మంజూరు చేస్తే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం టాక్టర్లను వినియోగించుకోకుండా సర్పంచ్ తన సొంత టాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.గ్రామాలలోని చెత్తను డంపింగ్ కు తరలించడం తోపాటు హరితహారం,ప్రకృతి వనం లాంటి మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు ట్రాక్టర్లను మంజూరు చేస్తే దానికి భిన్నంగా సర్పంచ్ తమ వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం లోని లాలుతండా గ్రామపంచాయతీలో ఆదివారం నాడు చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అధికార పార్టీకి చెందిన సర్పంచ్ తన సొంత పనులకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించుకుంటున్నారని తెలిపారు.ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ప్రైవేట్ పనులకు ఉపయోగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తో ఓ వ్యక్తికి నిరంతరం మొరాన్ని తరలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ నూతన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్న సర్పంచ్ పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు….