సోనియమ్మ రాజ్యం మళ్లీ రావాలి
నంగునూరు,అక్టోబర్(21)జనంసాక్షి :
తెలంగాణ ప్రజల భాదలు పోవాలంటే
సోనియమ్మ రాజ్యం రావాలని
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
దేవులపల్లి యాదగిరి పిలునిచ్చారు.
శుక్రవారం నంగునూర్ మండలం గట్లమల్యాల గ్రామములో
కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి హాజరై జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దేవులపల్లి యాదగిరి
మాట్లాడాతూ… తెలంగాణ రాష్ట్రము ఇస్తే ప్రజలు అందరు బాగు పడతామని చెప్పి చేసిన ఉద్యమాన్ని ప్రజల కోరికను గౌరవించిన సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్టానిస్తే బాగుపడ్డది ఒక్క కెసిఆర్ కుటుంబం, కొంతమంది తెరాస కార్యకర్తలు అని అన్నారు.
ఇచ్చిన హామీలు అమరుల ఆశయాలను తుంగలోతొక్కిన తెరాస ప్రభుత్వం నాలుగులక్షల కోట్ల అప్పులుచేసి సంక్షేమ పథకాలనేమో కొంతమంది తెరాస కార్యకర్తల ఇండ్లకే పరిమితం చేశారని విమర్శించారు.
ఎంపీటీసీ ఏనుగందుల నితిన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు బాగుపడాలన్న అభివృద్ధి చెందాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సోనియమ్మ రాజ్యం వస్తేనే అది సాధ్యమైతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు తప్పెట శంకర్,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాగు శ్రీకాంత్ యాదవ్,
మండల ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్ ,రంగు అశోక్ గౌడ్,యస్సి సెల్ మండల అధ్యక్షులు రాగుల కృష్ణ ,కుసుంభ రాజేశం,రాగుల మైసయ్య ,అనరాజు నాగరాజు,ముస్త్యాల యాదగిరి,సుద్దాల రాజిరెడ్డి ,
జంగిటి శ్రీనివాస్,కొమ్మూరి
రాజిరెడ్డి,
వెంకటేశం,అనిల్ ,రాజు ,స్వామి
కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి,కరెడ్ల రాజిరెడ్డి,
పాల్గొన్నారు,