సోమవారము ప్రజా వాణి రద్దు

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 22 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా లో అక్టోబర్ 24వ తేదీ సోమవారము జరిగే ప్రజా వాణి రద్దు చేయబడినదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 24 న దీపావళి పండుగ సెలవు ను ప్రకటించడం జరిగిందని, జిల్లా ప్రజలు ఎవరు కూడా కల్లెక్టరేట్ కు రావద్దని కోరారు. జిల్లా ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు.