సౌర విద్యుత్ కేంద్రాన్ని తరలించాలని ఎమ్మెల్యే రాస్తారోకో
గోదాదరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఎన్టీపీసీ సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జనావాసాల మధ్య ఉన్న 62 ఎకరాల స్థలాన్ని ఐటీ పార్కు, వైద్య కళాశాలకు కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సౌర విద్యుత్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు.