స్కాలర్‌‌షిప్ ఎన్ రోల్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ .02(జనం సాక్షి).
ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌‌షిప్ దరఖాస్తు, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.
బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌‌షిప్ దరఖాస్తు, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ , నిధుల వినియోగం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇదే అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహశీల్దార్ లు, వసతి గృహాల సంక్షేమ అధికారులతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు.
సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో 3968 మంది విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకాని కోసం నమోదు లక్ష్యం కాగా ఇప్పటివరకు 1680 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. అలాగే పోస్ట్ మెట్రిక్ పథకం కోసం 2369 టార్గెట్ లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 1291 మంది విద్యార్థులు నమోదు అయ్యారని అన్నారు.
అర్హులైన విద్యార్థులు అందరూ ప్రి, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. స్కాలర్షిప్ నమోదు కోసం ఎవరికైనా కుల ధ్రువీకరణ పత్రాలు లేకుంటే వాటిని వెంటనే సంబంధిత విద్యార్థికి అందించే బాధ్యత సంబంధిత మండల తాసిల్దార్ దేనిని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ నెలాఖరులోగా అర్హులైన అందరు విద్యార్థులు పోస్ట్ ,ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం నమోదు అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని 13 ఎస్సీ బాలురు, బాలికల వసతి గృహాలు ఉండగా ఇప్పటి వరకూ 582 మంది అడ్మిషన్ పొందారని చెప్పారు. ఇంకా 600 కు పైగా ఖాళీలు ఉన్నాయనీ అన్నారు. ముఖ్యంగా ఎస్సీ బాలికల వసతి గృహాల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని అన్నారు.వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసలలో అర్హులైన వారిని గుర్తించి వసతి గృహాల్లో నమోదు అయ్యేలా ప్రత్యేక చూపాలని అధికారులకు సూచించారు. ఎస్సీ వసతి గృహాలకు కరెంటు ,అద్దె, కాస్పొటిక్ మెటీరియల్స్, పాకెట్ మనీ కింద వచ్చిన బడ్జెట్ ను సాధ్యమైనంత త్వరగా సంబంధిత వాటికి ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. నిధుల ఖర్చులకు సంబంధించి రిపోర్ట్ ను వసతి గృహ సంక్షేమ అధికారి హాస్టల్ వారీగా అందించాలన్నారు.
ఈ డబ్ల్యు ఐ డి సి ఈ ఈ విరూపాక్ష , డి ఎస్ సి డి ఓ.మోహన్ రెడ్డి లు ఎస్సీ వసతి గృహాలను సందర్శించి పెండింగ్ పనులను వెంటనే పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు