స్కూలుకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరి
ఆదిలాబాద్,జూన్8(జనం సాక్షి):తొలకరి పలకరించింది. ఇక స్కూళ్లు కూడా తెరవబోతున్నారు. వాన రాకతో చిత్తడి కానుంది. ఈ దశలో స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రధానంగా గిరిజన పిల్లలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అంటురోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే స్కూలు వెళ్లే చిన్నారులకు వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణలు ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్, కేజీబీవీ, మాడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, ఐసీడీఎస్, ఐకేపీ శాఖల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లోని పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.