స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు.

అయిజ (జనంసాక్షి)ఆగస్ట్ 18 జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల కేంద్రంలో  స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహశీల్దార్ యాదగిరి ,ఎంపీడీవో నాగేంద్ర చేతుల మీదుగా శుక్రవారం స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభించారు.కొత్త బస్టాండు సమీపంలో భారత్ నగర్ లోకి వెళ్లే రహదారి లో వాస్తు నీలకంటయ్య కుమారుడు మల్లిఖార్జున స్వామి వివేకానంద స్థానిక ఉత్పత్తి వస్తువుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.స్థానికంగా తయారైన పేపర్ ప్లేట్స్ జైలులో యహయారయ్యే వస్తువులు చేతి వృత్తులతో ఉత్పత్తి అయిన వస్తువులు ప్రకృతి వస్తువులు ఆహార సంబంధిత వస్తువులు దీపావళికి మట్టికుండలు ప్రావిదలు దసరాకు పతంగులు యిలా చేతితో తయారైన ప్రతి వస్తువు ఇక్కడ లభిస్తుందని నిర్వాహకులు మల్లిఖార్జున తెలిపారు.