స్థానిక సంస్థలు మూల స్థంభాలు

4

గ్రేటర్‌ ఎన్నికలపై హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలని హైకోర్టు ఆభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తేదీతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని  కోర్టు ఆదేశించింది. వారంలోగా ఎన్నికల తేదీని సూచిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. రాజ్యాంగపరమైన విధులను ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తుందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గడువు ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకే  వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌కు కోర్టు సూచించింది. రాజ్యాంగపరమైన విధులను ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించింది. స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు.. ఎన్నికల పట్ల నిర్లక్ష్యం తగదని కోర్టు పేర్కొంది.  ఎప్పటిలోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  స్థానిక సంస్థల ఎన్నికల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రభుత్వానికి ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై దాఖలైన పిటిషన్‌ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పాలన ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది.