స్పీకర్ పోచారంను పరామర్శించిన కేసీఆర్
కామారెడ్డి, ఫిబ్రవరి7(జనంసాక్షి) : బాన్సువాడ మండలం పోచారంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. కాగా గురువారం సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బాన్సువాడ చేరుకుని అక్కడున్నంచి రోడ్డుమార్గం ద్వారా పోచారం వెళ్లారు. అనంతరం పోచారం నివాసం చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొద్దిసేపులో పోచారంతో మాట్లాడారు. కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపీ కవిత, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గణెళిశ్ గుప్తాలు ఉన్నారు.