స్పృహలోకి వచ్చిన సురేష్‌ భాయి

1

వాషింగ్టన్‌  ఫిబ్రవరి 15 (జనంసాక్షి):

అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్‌భాయ్‌ పటేల్‌ (57) ఆరోగ్యం  మెరుగుపడుతోంది. ఆయన

లేచి కూర్చుంటున్నారని, మాట్లాడుతున్నారని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది హెన్రీ ఎఫ్‌. షెరాడ్‌ తెలిపారు. సురేష్‌భాయ్‌ కోలుకోవడానికిి మాత్రం చాలా కాలం

పడుతుందన్నారు. ఆయన చేతి పట్టు, కుడికాలు బాగున్నాయని, ఎడమకాలు మాత్రం ఇంకా స్వాధీనంలోకి రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన మాట్లాడుతున్నారని, తింటున్నారని చెప్పారు. ఈ దాడిలో ప్రధానంగా చేతులు, కాళ్లవిూదే ఎక్కువ ప్రభావం పడిందన్నారు.చిరునామా, గుర్తింపు వివరాలు అడిగినప్పుడు ఇంగ్లీషు భాష సరిగ్గా రాకపోవడంతో సురేష్‌భాయ్‌ పటేల్‌ సరిగ్గా చెప్పలేకపోయారు. దాంతో ఇద్దరు పోలీసు అధికారులు ఆయనను కిందపడేసి విపరీతంగా కొట్టారు. ఈ ఘటన ఈనెల

6వ తేదీన మాడిసన్‌ నగరంలో జరిగింది. కాగా, ఈ దాడిపై ఎన్నారైలు తీవ్రంగా స్పందించారు. ఆయన చికిత్స కోసం ఇప్పటివరకు రూ. 93 లక్షల విరాళాలు సేకరించారు. ఆయనకు ఆరోగ్య బీమా లేకపోవడంతో మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవలే మనవడు పుట్టడంతో కొడుక్కి, కోడలికి సాయంగా వచ్చిన పటేల్‌కు.. ఆరోగ్యబీమా

చేయించలేదు. ఆయన చికిత్సకు సుమారు కోటిన్నర వరకు అవుతుందని అంచనా. దాడికి పాల్పడిన వారిలో ఎరిక్‌ పార్కర్‌ అనే అధికారిని సస్పెండ్‌ చేసి, అరెస్టు చేసినా, బెయిల్‌ విూద విడుదల చేశారు.