స్యూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి
ఖమ్మం: స్కూల్ వ్యాన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ పాఠశాల విద్యార్ధిని మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కోర్టు ఎదుట త్రివేణి పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న విద్యార్ధిని రూప (6) స్కూల్ వ్యాన్ ఎక్కుతుండగా వాహనం ముందుకు కదలటంతో దానికింద పడింది. వాహనం వెనక చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.